మన్యం న్యూస్ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ముత్యాలమ్మ నగర్ గ్రామ పంచాయతీలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పర్స లక్ష్మీనారాయణ రావు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హాజరయ్యారు.ఈ సందర్బంగా వారి కుటుంబ సభ్యులకు విప్ రేగా కాంతరావు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో జెడ్పీటీసీ పోశం.నర్సింహారావు,మండల కో ఆప్షన్ సభ్యులు జవిద్ పాషా, సర్పుంచ్ లు కొమరం. జంపేశ్వరి,బచ్చల భారతి, స్థానిక ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,పార్టీ సీనియర్ నాయకులు,యువజన నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.