UPDATES  

 మరో మారు బిఆర్ఎస్ సర్కారు అభివృద్ధి,సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాలి -సర్పంచ్ ఏనిక.ప్రసాద్

 

మన్యం న్యూస్ మణుగూరు:

మణుగూరు మండలం లోని కూనవరం పంచాయితీలో. సర్పంచ్ ఏనిక.ప్రసాద్,యువ నాయకులతో కలిసి బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ,రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని, కోరుతూ,కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సర్పంచ్ ఏనిక.ప్రసాద్ మాట్లాడుతూ,మూడవ సారి కూడా బిఅర్ఎస్ ప్రభుత్వం రావడం కాయం అన్నారు. అభివృధి,సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ కు శ్రీరామ రక్ష అని, తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. పినపాక నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు.ఈ కార్యక్రమం లో కూనవరం సర్పంచ్ ఏనిక. ప్రసాద్,జాగృతి జిల్లా అధ్యక్షులు పవన్ నాయక్, పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్వీ అధ్యక్షులు రాహుల్ గౌడ్,వర్కింగ్ ప్రెసిడెంట్ పాయం ప్రవీణ్, రమణ,నితిన్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !