UPDATES  

 మణుగూరు సింగరేణి గనులను సందర్శించిన రైల్వే ప్రిన్సిపల్ ఏక్సిక్యూటివ్ డైరెక్టర్ టి‌టిఎం రాజేశ్ పథక్

 

మన్యం న్యూస్ మణుగూరు:

ఐ‌ఆర్‌టి‌ఎస్ ప్రిన్సిపల్ ఏక్సిక్యూటివ్ డైరెక్టర్ టి‌టిఎం, రైల్వే బోర్డు,న్యూఢిల్లీ,సుదర్శన్ రెడ్డి మణుగూరు సింగరేణి ఏరియాలో పర్యటించారు.ఈ సందర్బంగా మణుగూరు లోని కే‌సి‌హెచ్‌పి,ఓసి-4 ఉపరితల గని ని డాక్టర్ జే.ఆల్విన్ సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మేనేజ్మెంట్ ఐ‌ఆర్‌టి‌ఎస్, చీఫ్ కమర్షియల్ మేనేజర్, పాసెంజర్ సర్వీసెస్,సౌత్ సెంట్రల్ రైల్వే ఆర్ సుదర్శన్ ఐ‌ఆర్‌టి‌ఎస్,ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్, సింగరేణి ఉన్నత అధికారులు, సంబందిత రైల్వే అధికారులతో కలిసి సందర్శించడం జరిగింది. ప్రిన్సిపల్ ఏక్సిక్యూటివ్ డైరెక్టర్ టి‌టిఎం గా బాధ్యతలు స్వీకరించిన తరువాత మణుగూరు ఏరియాకు మొట్ట మొదటి సారి విచ్చేసిన సందర్భంగా రాజేశ్ పథక్ కు సింగరేణి అధికారులు కే‌సి‌హెచ్‌పిలో ఆత్మీయ సత్కారం చేయడం జరిగింది. అనంతరం రాజేశ్ పథక్ కే‌సి‌హెచ్‌పికి గనుల నుండి వచ్చే బొగ్గు బెల్ట్ సిస్టమ్ ద్వారా బ్యాంకర్లకు పడడం,అక్కడ నుండి రైల్వే వేగన్ లలో అతి తక్కువ సమయంలో లోడ్ అయ్యే అత్యాధునిక సాంకేతిక ప్రక్రియను ఎంతో ఆసక్తిగా తిలకించారు.అనంతరం పి‌కే‌ఓసిస-4 వ్యూ పాయింట్ నుండి ఉపరితుల గని పరిశీలించి ఓబి వెలికితీత కోల్ బెంచ్ ల నుండి భారీ వాహనాల ద్వారా బొగ్గు సరఫరా ప్రక్రియను పరిశీలించి, కే‌సి‌హెచ్‌పి లో సంబందిత అధికారులతో జరిగిన సమావేశంలో బొగ్గు నాణ్యతకు పాటిస్తున్న పద్దతుల గురించి, బి‌టి‌పి‌ఎస్ కు రైల్వే మార్గం ద్వారా బొగ్గు రవాణాకై నిర్మిస్తున్న ట్రాక్ లైన్ పనుల పురోగతి గురించి రైల్వే అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా తమ పర్యటనకు గుర్తుగా వారు పి‌కేఓసి గని ప్రాంతంలో మొక్కలు నాటరు. సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మేనేజ్మెంట్ డాక్టర్ జే ఆల్విన్,ఐ‌ఆర్‌టి‌ఎస్ మాట్లాడుతూ,మణుగూరు ఏరియాలో సెల్ పిక్కింగ్, గ్రేడింగ్ పద్దతిని పగడ్బందీగా అమలు చేస్తున్నందున వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు ఇవ్వగలుగుతున్నాము అన్నారు.అలాగే ఇతర పరిశ్రమలతో పాటు బి‌టి‌పి‌ఎస్ కు గతం కంటే రెట్టింపు బొగ్గు రవాణా చేసే ప్రతిపాదన ఉందని,పటిష్టమైన బొగ్గు ఉత్పత్తి,రవాణా వ్యవస్థ కలిగి ఉన్న మణుగూరు ఏరియా నిర్దేశిత లక్ష్యాలైన 119.5లక్షల టన్నుల ఉత్పత్తిలో రైల్వే ద్వారా 65 లక్షల టన్నులు రవాణా చేయబడుతుంది అన్నారు.భవిష్యత్తు డిమాండ్ లకు తగ్గ బొగ్గు ఉత్పత్తి, రవాణాకు కూడా మణుగూరు ఏరియా సంసిద్ధంగా ఉంది అని అధికారులు వివరించారు.ఈ సందర్భంగా రాజేశ్ పథక్, ఐ‌ఆర్‌టి‌ఎస్ సంబందిత అధికారులకు కొన్ని సూచనలు చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమంలో రైల్వే అధికారి సురేశ్,డి‌జి‌ఎం కే‌సి‌హెచ్‌పి మధన్ నాయక్,ఓసి-4 మేనేజర్ ఆపరేషన్స్ డి శ్రీనివాస్,ఎస్‌ఈ ఈఎం నిరంజన్,పర్యావరణ అధికారి జే శ్రీనివాస్,ఇతర రైల్వే అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !