* సంఘవిద్రోహశక్తులకు సహాయం అందిస్తే కఠిన చర్యలు:డిఎస్పి
మన్యం న్యూస్,బయ్యారం:సమాజానికి భంగం కలిగించేవిధంగా సంఘ విద్రోహశక్తులకు సహాయం అందించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డిఎస్పి సత్యనారాయణ అన్నారు. బయ్యారం మండల కేంద్రంలో గత బుధవారం రోజున లొంగిపోయిన మాజీ మావోయిస్టులకు, సానుభూతిపరులకు స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఏదైనా సమాచారం ఉన్నట్లైతే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ కోట బాబురావు, ఎస్సై ఉపేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.