UPDATES  

 హాత్ సే హాత్ జోడోయాత్ర తో కేంద్ర ప్రభుత్వానికి మనకు *కోరం అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణు

లు మన్యంన్యూస్,ఇల్లందు:కాంగ్రెస్ పార్టీ జాతీయ యువనాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన హాత్ సే హాత్ జోడోయాత్ర గురువారంతో సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. పీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు భద్రాద్రి జిల్లా అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆదేశాలమేరకు జిల్లా జెడ్పీ ఛైర్మెన్ కోరం కనకయ్య కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పట్టణంలోని కరెంట్ ఆఫీస్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడుతూ..ఆనాడు రాహుల్ గాంధీ గొప్పసాహసం చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు నాలుగువేల పైచిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసి 12 రాష్ట్రాలమీదుగా కుల, మత ప్రాంతాలకు అతీతంగా ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ ప్రజలు ఐక్యమత్యంతో కలిసిమెలిసి సోదరభావంతో ఉండాలని అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని జోడో యాత్ర చేశారన్నారు. ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వం ప్రజలను రెచ్చగొడుతూ ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటుందని ప్రజలంతా గమనించి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పారదోలాలని ఆనాడు రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. సంవత్సరకాలాన్ని పూర్తిచేసుకున్న రాహుల్ గాంధీ జోడో పాదయాత్రని గుర్తు చేసుకుంటూ వారికి సంఘీభావంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ ర్యాలీ నిర్వహించడం ప్రతి ఒక్క కాంగ్రెస్ వాదికి గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు దొడ్డ డానియల్, పులిసైదులు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండి జాఫర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్టి హరికృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులు ఐజాక్, వాసుదేవ్, బీసీ,ఎస్టీసెల్ నాయకులు ఆవుదుర్తి శంకర్, వాంకుడోత్ నాగరాజ్, మైనారిటీ నాయకులు మసూద్, ఐఎన్టియుసి నాయకులు ఎండి మహబూబ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నందకిషోర్, బోళ్ళ సూర్యం, మడుగు సాంబమూర్తి, రావూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !