UPDATES  

 ఇల్లందు పట్టణాన్ని అభివృద్ధి చేశా

పట్టణంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
* మరో మారు ఆశీర్వదించండి
* వ్యాపారస్తులను కోరిన ఎమ్మెల్యే
* మద్దతు ప్రకటించిన ఇల్లందు వ్యాపారస్తులు, ప్రముఖులు మన్యంన్యూస్,ఇల్లందు:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ నాయక్ ని ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 16, 17, 18, 24 వార్డులలో గురువారం ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ పర్యటించారు. ఆయా వార్డులలోని వ్యాపారస్తులను ,వ్యాపార ప్రముఖులను కలిశారు. మీరు ఇచ్చిన అవకాశం తోనే ఇల్లందు పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. మరో మారు తనకు మద్దతు ఇవ్వాలని వ్యాపారస్తులను ఎమ్మెల్యే హరిప్రియ కోరారు.ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని కోరారు. గతంలో ఎన్నడూలేని అభివృద్దిని ఇల్లందు నియోజకవర్గంలో చేసిచూపిన ఎమ్మెల్యే హరిప్రియ తమ మద్దతు ఉంటుందని పురప్రముఖులు, వ్యాపారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీపాష, పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు, సోషల్ మీడియా ఇంచార్జ్ గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !