మన్యం న్యూస్,కరకగూడెం:
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అసెంబ్లీ ఎలక్షన్ – 2023 మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పలువురు సీనియర్లను ఎంపిక చేసింది. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిర్రమళ్ల గ్రామానికి చెందిన ఆదివాసి జాతీయ సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చందా లింగయ్య దొరకి ఆ కమిటీలో చోటు దక్కింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ శ్రేణులు చందా లింగయ్య దొరకు శుభాకాంక్షలు తెలిపారు.
