మన్యం న్యూస్,మణుగూరు: అభివృద్ధిని పినపాక నియోజకవర్గం లో బుల్లెట్ ల పరుగులు పెట్టించే ఎమ్మెల్యే రేగా కాంతారావు ఉండడం పినపాక నియోజకవర్గ ప్రజల అదృష్టం అని మంత్రి పువ్వాడ నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పై ప్రశంసల వర్షం కురిపించారు. శనివారం మణుగూరు మండలం కిన్నెర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
దండాలు పెట్టుకుంటు,తల నిమురుకుంటు,మెడ వంకర పేట్టి కౌగులిలించుకుంటే జరిగుతదా అభివృద్ది అని ప్రశ్నించారు.నిధుల వేట కోసం రేగా కాంతారావు నిత్యం తిరుగుతునే ఉంటారని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇంతలా తపించే ఎమ్మెల్యే ను నేను ఎక్కడ చూడలేదు అన్నారు.అలాంటి మంచి ఎమ్మెల్యే ఉండటం మీ అదృష్టం అన్నారు.ఇలాంటి వాళ్ళను గెలిపించుకోవాలి అని,బిఆర్ఎస్ ప్రభుత్వంను ను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలపునిచ్చారు.
