మన్యం న్యూస్,ఇల్లందు:మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ పత్తి స్వప్న జన్మదినం సందర్భంగా శనివారం పట్టణంలో గల జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య క్యాంపు కార్యాలయం నందు ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ముఖ్యఅతిథిగా హాజరై పత్తి స్వప్నని శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.