తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పాలనకు అద్దం పడుతోంది.
పథకాలను నిర్విఘ్నంగా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే.
*మండలం లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన,ప్రారంభోత్సవం చేసిన
మంత్రి పువ్వాడ,విప్ రేగా.
మన్యం న్యూస్ బూర్గంపహాడ్: మండల పరిధిలోని ఆర్ఎంఎస్ఏ నిధులతో సుమారు 2 కోట్ల 70 లక్షలతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కెజిబివి) భవనాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు శనివారం ప్రారంభించారు.అనంతరం బూర్గంపహాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అవరణలో డిఎంఎఫ్టి నిధులతో సుమారు 2 కోట్ల 70 లక్షలు అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన భవనం చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందనీ,సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండాగా నిలుస్తున్నారని,అన్ని వర్గాల వారికి మేలు చేకూరుస్తూ పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని,దేశమంతా ఆశ్చర్యపోయేలా తెలంగాణలో ఉచిత విద్యుత్,రైతు బంధు,రైతు బీమా వంటి పథకాలను నిర్విఘ్నంగా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని,ఇక్కడి సంక్షేమం,అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం తెలంగాణ తరహా పాలనను కోరుకుంటున్నారని మంత్రి అన్నారు.పక్కనే ఉన్న ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం కేసీఆర్ పాలనను స్వాగతిస్తుండడం తెలంగాణలో సంక్షేమ పాలనకు అద్దం పడుతోందని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా,జిల్లా ఎస్పీ వినీత్,డీఎస్పీ వెంకటేష్, సిఐ వినయ్ కుమార్,జిల్లా ఉన్నతాధికారులు బూర్గంపహాడ్ గ్రామ సర్పంచ్ స్వప్న,బూర్గంపహాడ్ మండల జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,జిల్లా టిఆర్ఎస్ నాయకులు కామిరెడ్డి రామకొండ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ గోపిరెడ్డి రమణారెడ్డి,పార్టీ మండల వర్కింగ్ ప్రసిడెంట్ జలగం జగదీష్,పార్టీ మండల యూత్ ప్రసిడెంట్ గొనేల నాని,ఐటిసి బిఆర్టియు అధ్యక్షులు సానికొమ్ము శంకర్ రెడ్డి,బూర్గంపహాడ్ మాజీ ఎంపీటీసీ జక్కం సర్వేశ్వరరావు మండల నాయకులు బోల్లు సాంబ,తోకల సతీష్,గంగరాజు యాదవ్,మాజీ జెడ్పీటీసీ భుపల్లి నర్సింహారావు,సారపాక పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కనకంచి శ్రీను,యూత్ ప్రసిడెంట్ చైతన్య రెడ్డి,నియోజకవర్గ సోషల్ మీడియా యూత్ ఉపాధ్యక్షులు చల్లకోటి పూర్ణ,తెలంగాణ ఉద్యమకారుడు పొడియం నరేంద్ర,బూర్గంపహాడ్ ఎస్సి సెల్ అధ్యక్షులు మందా ప్రసాద్ మండల యువ నాయకులు తోకల ప్రసాద్,సుధాకర్,నాగరాజు,విష్ణు,గుండె సతీష్,బొగ్గుల ప్రసాద్,వెంకటేష్ పలువురు ప్రజా ప్రతినిధులు,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.