మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్న పాల్వంచ పట్టణం నెహ్రూనగర్ ఏరియా రోడ్డు దారుణంగా తయారయింది. ఈ రోడ్డుమీద నడక నాట్యంగా మారింది. చినుకు పడితే చాలు రహదారి చిత్తడే. రోడ్లు పూర్తిగా బురద మయంగా మారడంతో రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొందని ఆ ప్రాంత ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దారి దుస్థితిపై సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు స్తంభాలు కూడా ప్రమాదకరంగా ఉన్నాయని తీగల సైతం కిందకు వేలాడుతుండడం వల్ల ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బురదమయంగా మారిన రహదారికి మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ప్రజాసంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.