మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులలో మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు పోవడం జరుగుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం వార్డుల్లో 16 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు వనమా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డుల్లో డ్రైనేజీలు సిసి రోడ్లు ఇతర సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని అన్నారు. వనమా వార్డులో పర్యటన సందర్భంగా కేసీఆర్ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల తీరును ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, వార్డు కౌన్సిలర్లు రుక్మాంధర్ బండారి, కోలాపూరి ధర్మరాజు, కాసుల ఉమారాణి, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.