మన్యం న్యూస్,ఇల్లందు:బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్న ముప్పైవేల మంది కాంట్రాక్టు కార్మికులు తమ రెక్కలుముక్కలు చేసుకుని పనిచేస్తు సింగరేణి సంస్థకు కోట్లరూపాయల ఆదాయం వచ్చేవిధంగా పనిచేస్తున్నా నేటికీ కార్మికుల జీతం పదివేలు దాటడంలేదని కాంట్రాక్టు కార్మికుల రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకూబ్ షావలి ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం ఉదయం పదకొండు గంటలకు పట్టణంలోని చండ్రకృష్ణమూర్తి మెమోరియల్ ట్రస్ట్ భవనంలో ఇఫ్టు ఆధ్వర్యంలో జరిగే ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల రాష్ట్రసదస్సును జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్రఅధ్యక్షులు యాకుబ్ షావలి శనివారం రైల్వేసైడింగ్, స్టోర్, జిఎం ఆఫీస్, కన్వీనియన్స్ వెహికల్ డ్రైవర్ల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఒప్పందం చేసుకొని నేటికీ పట్టించుకోవడం లేదన్నారు. రైల్వేసైడింగ్లో పనిచేస్తున్న కార్మికులకు పెరిగిన డిఏ ఏరియర్స్ కార్మికులకు ఇంతవరకు అందడం లేదన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. చట్టబద్ధ హక్కుల్ని అమలుచేసే ఒక ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిలో జీతాలు పెంచకుండా అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. కార్మికులు తక్షణమే పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఆదివారం ఇల్లందులో జరిగే ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర జనరల్ బాడీ జరుగుతుందని కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కార్మికులకు విజ్ఞప్తి చేశారు.