మన్యం న్యూస్,ఇల్లందు: పట్టణంలోని దాసరిగడ్డకు చెందిన కోవాకుల రాములు ఇటీవలే అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ రెండులక్షల యాభైవేలు ఎల్ఓసి మంజూరు చేయించి వారి చికిత్సకు సహకరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు కోలుకొని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటుండగా శనివారం ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించి ఐదువేల రూపాయల ఆర్థికసాయం అందజేశారు. అనంతరం జగదాంబ సెంటర్ 15వ వార్డుకు చెందిన జిల్లా గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ అక్కిరాజు గణేష్ ఇటీవలే కిడ్నీ ఆపరేషన్ చేయించుకొని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటుండగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి స్వగృహానికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఇల్లందు వ్యవసాయ మార్కెటింగ్ వైస్ చైర్మన్ బర్మావత్ లాల్ సింగ్, పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ చీమల సుజాత, రమేష్, శివాజీ, ఎస్కె పాషా, సుభాషిని, చంద్రకళ, సైదా తదితరులు పాల్గొన్నారు.