మన్యం న్యూస్ కరకగూడెం: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ స్కాం పేరుమీద అక్రమంగా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సిరిశెట్టి కమలాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్రమంగా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తదనే భయంతో స్కీముల పేరుతో అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టులు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే ప్రజలు సరైన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం మాజీ సర్పంచ్ పాయం. లక్ష్మీనారాయణ,ఈసం. సత్యనారాయణ పాల్గొన్నారు.
