మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలం బొజ్జయిగూడెం గ్రామపంచాయతీ అన్నారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్త చీమల శ్రీను తల్లి ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ శనివారము వారి స్వగృహానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు.
అదే గ్రామానికి చెందిన ఈసాల ముత్తయ్య ఇటీవలే అనారోగ్యముతో మరణించగా ఎమ్మెల్యే వారి స్వగృహానికి వెళ్లి కుటుంబాన్ని పరమర్శించారు.
ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెంట స్థానిక సర్పంచ్ చీమల వెంకటేశ్వర్లు, పాక్స్ చైర్మన్ మెట్ల కృష్ణ, బద్దం నాగేష్, ఆవుల గోపి తదితరులు ఉన్నారు.