మన్యం న్యూస్ కరకగూడెం: కరకగూడెం మండలం ఓ ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ తిప్పని శ్రీనివాస రావు కుమార్తె తిప్పని. స్పందన (17) ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. శనివారం స్పందన దశదినకర్మలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా హాజరై స్పందన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం సర్పంచ్ ఊకె.రామనాథం, చిరుమళ్ళ సర్పంచ్ పాయం.నరసింహారావు,గొల్లగూడెం సర్పంచ్ ఇర్ప.విజయ్ కుమార్,డిర్ డిపో సెల్సమేన్ కుంజ.దశరధం తదితరులు పాల్గొన్నారు.
