కలహాలు లేని సమాజమే నిజమైన అభివృద్ధి
* జాతీయ లోక్ అదాలత్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
క్షణికావేశంలో చేసిన తప్పులను పెద్దమనసుతో క్షమించి రాజీమార్గంలో పయనించాలని సూచించారు. సమాజ సుఖశాంతులకు రాజీమార్గమే ఉత్తమమని
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి మాట్లాడుతూ
కక్షిదారుల ముఖాలపై చిరునవ్వు చూడడమే లోక్ అదాలత్ ధ్యేయమని స్పష్టం చేశారు. కలహాలు లేని సమాజమే అభివృద్ధి చెందుతుందని అన్నారు. కుటుంబ కలహాలను విడనాడి తమ యొక్క కేసులను సామరస్యంగ రాజీమార్గం ద్వారా జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవడం ద్వారా డబ్బు సమయం ఆధాతో పాటు ఇరువురు స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతారని తెలిపారు. ఇంట్లో భార్యాభర్తలు చిన్న చిన్న సమస్యలను అక్కడే పరిష్కరించుకోవాలని కోర్టు మెట్ల వరకు రావద్దని తెలిపారు. కోర్టు కేసుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అందుకు జాతీయలో లోక్ అదాలత్ మంచి వేదిక అని తెలిపారు. కక్షిదారులకు మధ్యాహ్నం పులిహార అరటి పండు మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి అడేపు నీరజ, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎ.సుచరిత, పీపీ రాధా కృష్ణ మూర్తి, ఎ పి పి పీవీడీ లక్ష్మి , విశ్వశాంతి, లావణ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కుమార్ మక్కడ్, జనరల్ సెక్రటరీ రావిలాల రామారావు, సాహు సంతోష్, లక్కినేని సత్యనారాయణ, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ వి.పురుషోత్తమరావు, నిరంజన్ రావు, జ్యోతి విశ్వకర్మ , నాగ స్రవంతి, బెంచ్ మెంబర్లు ఎ.పార్వతి, రావిలాల రామారావు, బి. దేవదాస్, రఫిక్ పాషా, సీనియర్, జూనియర్ మహిళన్యాయ వాదులు పాల్గొన్నారు.