UPDATES  

 సమ్మక్క సారలమ్మ నడచిన చిరుమల్ల

సమ్మక్క సారలమ్మ నడచిన చిరుమల్ల
* ఏళ్ళ నాటి కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే రేగా
రూ4 కోట్ల 72 లక్షల వ్యయంతో బీటి రోడ్లు, చిరుమళ్ళ ఎస్సీ కాలని వద్ద బ్రిడ్జి మంజూరు
*రూ.62 లక్షలతో వీధి వీధికి సీ సీ రోడ్లు
* అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రేగా మేలు మరువం:చిరుమళ్ళ సర్పంచ్ పాయం నరసింహారావు

మన్యం న్యూస్ ,కరకగూడెం: ఆ గ్రామం ఆదివాసి ఇలవేల్పులు సమ్మక్క సారలమ్మలు జన్మస్థలంగా ఆదివాసి,గిరిజన బిడ్డలు భావిస్తారు. ఆ వన దేవతలను ఆ గ్రామానికి చెందిన చందా వారి వంశానికి చెందిన ఆడబిడ్డలుగా ప్రజలు చెప్పుకుంటారు. అంత గొప్ప ప్రాచీన చరిత్ర ఉన్న చిరుమల్ల గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది. అక్కడ గొప్ప గొప్ప నాయకులు ఉన్న అభివృద్ధి మాత్రం వారికి పట్టలేదు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం చిరుమల్ల పెద్ద వాగు పై హై లెవెల్ వంతెన నిర్మాణం చేసి ప్రజల కష్టాలు తీర్చారు. అనంతర కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేగా కాంతారావు తన టికెట్ ను తృణప్రాయంగా వదులుకున్నారు. ఆనాటి నుండి ఆ మారుమూల గ్రామాలను పట్టించుకున్న నాథుడే లేరు. ప్రజలు మరలతనను ఆశీర్వదించడంతో పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు ప్రత్యేక శ్రద్ధతో ఆ గ్రామం రూపురేఖలు మారిపోయాయి. గ్రామమే కాదు పంచాయతీలోని అన్ని గ్రామాలలో సిసి రోడ్లు వేయించి ప్రజల కష్టాలు తీర్చాడు ఎమ్మెల్యే రేగా కాంతారావు.మన్యం న్యూస్ ప్రత్యేక కథనం.
కరకగూడెం మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామపంచాయతీలో చిరుమల్ల,పొలకమతోగు,చిరుమళ్ళ ఎస్సీ కాలని,రాయనిపేట,కౌలురు గ్రామాలలోని వీధి వీధికి సీ సీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. గ్రామపంచాయతీ వ్యాప్తంగా మొత్తం 8 సీసీ రోడ్లకు గాను 62 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అలాగే కౌలురు నుండి పోట్లపల్లి వరకు 2 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది .పొలకమ్మతోగు నుండి దోమెడ వరకు ఒక కోటి రూపాయల వ్యయంతో బిటి రోడ్డు మంజూరు చెయ్యడం జరిగింది. అలాగే చిరుమల్ల ఎస్సీ కాలనీ వద్ద వర్రె పై 60 లక్షల రూపాయలతో నూతనంగా బ్రిడ్జి పూర్తి చేసుకున్నారు. చిరుమళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామలకు సీ సీ,బిటి రోడ్లు మంజూరు చేసి అభివృద్ధి పదంలో ముందుకి నడుపుతున్న పినపాక ఎమ్మెల్యే,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీ. ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు కి ఋణపడి ఉంటామని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు.
ఇంత గొప్ప నాయకుడు మా మండలంలో పుట్టడం మా అదృష్టం:
చిరుమల్ల సర్పంచ్ పాయం.నరసింహారావు
మా గ్రామ పంచాయతీలోని నూతనంగా 7 సిసి రోడ్లకు గాను 62 లక్షల రూపాయలు అలాగె రెండు బిటి రోడ్లు, ఒక్క బ్రిడ్జి నిర్మాణానికి గాను మొత్తం నాలుగు కోట్ల 72 లక్షలు మంజూరు చేసినందుకు విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మూడవసారి ముచ్చటగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మరల మా గ్రామపంచాయతీ లోని గ్రామాలు మరింత అభివృద్ధి చెందేలా చేసుకుంటామని ఆయన తెలిపారు. ఇంత గొప్ప నాయకుడు కరకగూడెం మండలంలో పుట్టడం మా మండలం తో పాటు పినపాక నియోజకవర్గ ప్రజలు కూడా అదృష్టవంతులం అని మన్యం న్యూస్ కి తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !