- రేగాతోనే మా ప్రయాణం.
- బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం.
- అభివృద్ధి,సంక్షేమానికి ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలోకి జోరు చేరికలు.
- దేశం చూపు తెలంగాణ వైపు.
- సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఎనలేని అభివృద్ధి.
- కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు 30 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక.
- మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో బూర్గంపహాడ్ మండలానికి చెందిన నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు సుమారు 30 కుటుంబాలు సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.అనంతరం పార్టీలో చేరిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీతోనే అన్ని వర్గాల సంక్షేమం ఫలాలు అందుతున్నాయి అని,సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వ పాలనలో న్యాయం జరుగుతుంది అన్నారు,వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని,సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారనీ,సంక్షేమ పథకాలాన్ని సజావుగా అందాలంటే మరోసారి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని ఆయన అన్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ మైనారిటీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారని ఆయన అన్నారు.షాది ముబారక్ పథకం ద్వారా లక్ష 116 రూపాయలను అందజేయడం జరుగుతుందనీ,మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందనీ,తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం మనదేనన్నారు,రైతుబంధు,రైతు బీమా,దళిత బంధు,బీసీ బందు,నేతన్న భీమా,కేసీఆర్ కిట్టు కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ పథకాలను ఆయన గుర్తు చేశారు.రాష్ట్రంలో 44 లక్షల మంది ఆసరా పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు,నియోజకవర్గ అభివృద్ధి,ప్రజల సంక్షేమమే తన ఎజెండా అని రానున్న రోజులలో పినపాక నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ భుక్య శ్రావణి,ఉపసర్పంచ్ ఝాన్సి రైతు సమన్వయ కమిటీ ఛైర్మన్ బిజ్జం శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ చైర్మెన్ గోపిరెడ్డి రమణారెడ్డి మండల సీనియర్ నాయకులు ధారం కృష్ణ రెడ్డి,ముస్లిం మైనార్టి మండల అధ్యక్షులు సాదిక్ పాషా,జనరల్ సెక్రెటరీ గుల్ మహమ్మద్,రెడ్డిపాలెం ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు సుభాని వారితో పాటు పార్టీలో చేరిక అయిన షేక్ ఇమామ్,భాష,షేక్ అబ్బాస్,షేక్ అన్వర్,షేక్ బాబా,షేక్ మక్బూల్ తో పాటు పలువరు మహిళలు మండల నాయకులు పలువరు కార్యకర్తలు పాల్గొన్నారు.