మన్యం న్యూస్, అశ్వాపురం:అశ్వాపురం మండలంమొండికుంట గ్రామపంచాయతీలో సర్పంచ్ మర్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ వర్ధంతి వేడుకలు అధికారికంగా ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి , భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం లాఠీలను తూటాలను లెక్కచేయకుండా ఈ భూమి నాది ఈ పంట నాది మధ్యలో నీ పెత్తనమేంది అని మాటల తూటాలతో మహిళల్లో చైతన్యం రగిలించి కూలీలను, రైతులను ఏకతాటి మీదికి తీసుకొచ్చి దొరల ఆగడాలను విష్ణుర్ దేశ్ ముఖ్ దౌర్జన్యాలను ఎదిరించిన వీర వనిత అని ,1940లో జరిగిన తెలంగాణ సాయుధ రైతంగ పోరాటంలో ఒక అగ్నికణిక చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు చెన్నూరు రమేష్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మెడవరపు సుధీర్ కార్యదర్శి ప్రవీణ్, చిటికెన రమేశ్ తూము కళాధర్ దారపు శ్రీను, నూతలపాటి వెంకటేష్. పసుల లింగయ్య గాడుదుల లింగమల్లు రాసమల్ల ఎల్లయ్య, ధనమ్మ నూతలపాటి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.