*మన్యంన్యూస్,ఇల్లందు:ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వరుసగా రెండవసారి దొడ్డ డానియల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను పట్టణనాయకులు పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. అనంతరం పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ మాట్లాడుతూ.. రెండవసారి పట్టణ అధ్యక్షులుగా ఉత్తర్వులు జారీచేసి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి భద్రాద్రి జిల్లా అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్యకి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో మరో మారు పదవి కట్టబెట్టిన భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, పొంగులేటి, కోరం కనకయ్య, రాంరెడ్డి గోపాల్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై కాంగ్రెస్ పార్టీ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్, ఈక్స్వర్ గౌడ్, నారాయణ, స్వరూప, శీను, దల్ సింగ్, ఐజాక్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
