UPDATES  

 9 సంవత్సరాలు గడిచినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కెసీఆర్ ప్రభుత్వానికి గుర్తుకురాలేదా

9 సంవత్సరాలు గడిచినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కెసీఆర్ ప్రభుత్వానికి గుర్తుకురాలేదా

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో హక్కుల సాధనకై సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులంతా పోరాడాలి

మన్యం న్యూస్,ఇల్లందు:ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో ఇల్లందులోని కామ్రేడ్ ఎల్లన్న భవన్లో ఆదివారం కాంట్రాక్టు కార్మికుల రాష్ట్రసదస్సు షేక్ యాకూబ్ షావలి అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, ఇఫ్టు రాష్ట్రప్రధాన కార్యదర్శి సూర్యంలు పాల్గొని మాట్లాడుతూ.. సింగరేణిలో 30 వేలమంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నప్పటికీ వారి బాధలు, గాధలు కేసీఆర్ ప్రభుత్వానికి వినబడడంలేదని, అధికారంలోకి రాకముందు పర్మినెంట్ చేస్తానన్న హామీని ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని కేసీఆర్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. సింగరేణిలో అనేక సమ్మెలు, ఆందోళనలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వీరిసమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడంలేదని 18రోజుల పాటు సుదీర్ఘ సమ్మె చేసినప్పటికీ కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరించిందని ఆవేదన వ్యక్తపరిచారు. 9ఏళ్లు గడిచినప్పటికీ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు రాష్ట్రప్రభుత్వానికి గుర్తురావడం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సింగరేణి కాంట్రాక్టు కార్మికులంతా వేతనాల పెంపు, సౌకర్యాలకై పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్ర సదస్సు కార్యక్రమంలో ఐఎఫ్టీయు రాష్ట్రసహాయ కార్యదర్శి రామయ్య, రాష్ట్రనాయకులు మధుసూదన్, కిరణ్, పాయం వెంకన్న, వేముల గురునాధం, రమేష్ లతో పాటుగా అన్ని డివిజన్ల నుండి కార్యకర్తలు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !