మన్యం న్యూస్ ,చర్ల:
హిమాలయ పర్వతాల్లోనే అరుదుగా పూచే పుష్పం, బ్రహ్మ శివుడి దేవుళ్లకు ఇష్టమైనదిగా విష్ణుమూర్తి రూపం గల పుష్పం బ్రహ్మ కమలం. ఈ బ్రహ్మ కమలం పుష్పం గురించి చాలా మంది వినే ఉంటారు కానీ అరుదుగా చూసుంటారు. హిమాలయాల్లో మాత్రమే పూచే ఈ పువ్వు ను చూడాలనుకుంటే రండి అంటున్నారు వెంకటేశ్వర్లు…. వివరాల్లోకెళ్తే చర్ల మండలంలోని ముత్యాలమ్మ గుడి వీధి లో ఉన్న సీనియర్ జర్నలిస్ట్, కండక్టర్ సాయిల వెంకటేశ్వరరావు వెంకటరమణ దంపతుల ఇంటికి వెళితే బ్రహ్మ కమలం పుష్పము చూడవచ్చు. తన ఇంట్లో సంవత్సరానికి ఒకసారి పూచే ఈ పువ్వును వెంకటేశ్వరరావు ప్రతి సంవత్సరం శివాలయంలో గాని, అమ్మవారి పూజకు మాత్రమే అర్పిస్తూ ఉంటారు.
అసలు ఈ పువ్వు ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దాం….
హిమాలయ పర్వతాల వద్ద ఉండే వాతావరణంలో మాత్రమే అరుదుగా పూచే పుష్పం ఈ బ్రహ్మ పష్పం. ఈ పుష్పం పూచే మొక్క దాదాపు 5 నుంచి 7 సంవత్సరాల వరకు పెరిగి ఆ తర్వాత పువ్వులు పూయడం చేస్తుంది. అది కూడా సంవత్సరానికి రెండు లేదా మూడు పూవ్వులు మాత్రమే పూస్తాయి. ఈ పువ్వు రాత్రి సమయంలో సుమారుగా 10 నుంచి 12 గంటల ప్రాంతంలో మాత్రమే వినిపిస్తూ మంచి సువాసనను వెదజల్లుతుంది. ఈ పువ్వుతో శివుడికి కార్తీక మాసంలో పూజ చేస్తే పుణ్య ప్రాప్తి కలుగుతుందని పెద్దలు నమ్మకం. ఈ పువ్వు పూసిన చోట దేవకన్యలు వస్తాయని ఈ దేవకన్యలు అడిగిపెట్టిన చోట అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉంటారని పూర్వీకులు అంటారు. అంత అద్భుతమైన అరుదైన పువ్వులు చూడడానికి మండల వాసులు వెంకటేశ్వరావు ఇంటికి వస్తున్నారు. ఈ పువ్వుని దర్శించుకోవడం వలన బ్రహ్మ విష్ణు వులను దర్శించుకున్నట్టుగా ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు.