మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున కొత్తగూడెం నియోజకవర్గంలోని పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ సీనియర్ బిజెపి రాష్ట్ర నాయకులు కె.వి రంగా కిరణ్ ఆదివారం హైదరాబాద్ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో దరఖాస్తు అందచేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తులు అందజేయడానికి ఆఖరి రోజు కావడంతో ఆయన రాష్ట్ర కార్యాలయంలో తమ దరఖాస్తు పరిశీలన కొరకు అందజేశారు.