మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఈనెల 11వ తేదీ నుండి అంగన్వాడీలు సమ్మెలోకి దిగుతారని కొన్ని సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. అయితే మినీ అంగన్వాడిలు మాత్రం సమ్మెకు దూరంగా ఉంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న మినీ అంగన్వాడీ టీచర్లు ఎవరూ కూడా ధర్నాలు సమ్మెలు చేయడం లేదని తెలంగాణ మినీ అంగన్వాడీ టీచర్ యూనియన్ జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శలు వి.వెంకటరమణ, వి.దేవి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం
శిశు సంక్షేమ శాఖ అధికారిని విజేతకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3989 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో బి ఆర్ టి యు అనుబంధ సంస్థ అయినా తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడేపు వరలక్ష్మి ఈ నిర్ణయం తీసుకున్నట్లు భద్రాద్రి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తెలిపారు. మినీ అంగన్వాడీలకు ఎలాంటి సరుకులు లేకుండా మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా గుర్తించడంతోపాటు త్వరలో జీవోను సైతం విడుదల చేస్తున్నారని తెలిపారు. కనుక తమ సంఘం నుండి ఎటువంటి ధర్నాలు కానీ సమ్మెలు కానీ నిర్వహించకూడదని సంఘం రాష్ట్ర బాధ్యులు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మినీ అంగన్వాడీ టీచర్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మినీ అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.