మన్యం న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 10: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి అని ఎంపీపీ జల్లిపల్లి అన్నారు.
మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఆదివారం తెలంగాణ వీరనారి వర్ధంతి సందర్భంగా ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కనిక తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర, సూపర్డెంట్ ప్రసాద్, కార్యాలయ సిబ్బంది చారి, పాష తదితరులు పాల్గొన్నారు.