మన్యం న్యూస్ చండ్రుగొండ,సెప్టెంబర్ 10: ముస్లీంల హక్కుల సాధనకు చలో నల్గొండ కార్యక్రమం చేపట్టడం జరిగిందని జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్ అన్నారు. ఆదివారం చండ్రుగొండ ముస్లీం మైనార్టీలు చలో నల్గొండ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రసూల్ మాట్లాడుతూ…. ముస్లీం మైనార్టీల కోసం జమాయితే ఉలమా హిందీ (జేయుహెచ్)ఆద్వర్యంలో నల్గొండ క్లాక్ సెంటర్లో బహిరంగ సభ పెట్టడం జరిగిందన్నారు.ఈ సభకు ముస్లీం మైనార్టీలు అధిక సంఖ్యలో పాల్గొంటారన్నారు. ముస్లీంలు తమ హక్కులను సాధించటం కోసం ముందుకు సాగేందకు నిర్ణయించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లీం, మైనార్టీలు షమీహుస్సేన్, అబ్దుల్ూజ్, ఎస్కె ఆదామ్, యాకూబ్, దస్తగిరి, యాకూబాసాహెబ్,జాకిర్ తాహెర్, అజీమ్, ఎంఏ వాహెద్, తడతరులు పాల్గొన్నారు..