మన్యం న్యూస్ బూర్గంపహాడ్:వినాయక ఉత్సవాలు సమిష్టిగా,ప్రశాంతంగా నిర్వహించాలి అని బూర్గంపహడ్ ఎస్ఐ రాజ్ కుమార్ అన్నారు.మండల పరిధిలో ఈ నెల వినాయక చవితి సందర్భంగా మండపాలలో ఏర్పాటు చేసే వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఖచ్చితంగా పోలీస్ వారి పర్మిషన్ తీసుకోవాలి అని,ప్రతి ఏడాదికి మాదిరిగానే ఈ ఏడాది కూడా నియమ నిబంధనలు పాటించాలని ఎస్ఐ రాజ్ కుమార్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు.ముఖ్యంగా వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు విద్యుత్ శాఖ అధికారుల నుండి డిడి కట్టి అనుమతులు పొందాలి అని,మండపాలను రోడ్డుకు అడ్డంగా వేయరాదని,మైక్ పర్మిషన్ తీసుకావాలనీ,ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసు శాఖ నిబంధనలను పాటించాలి అని స్థాయికి మించి సౌండ్ పొల్యూషన్ కు పాల్పడటం,అసభ్య నృత్యాలు చేయడం,బలవంతపు చందాలు వసూలు చేయడం వంటి అంశాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలోఅదనపు ఎస్ఐ నాగబిక్షం , వివిధ ఉత్సవ కమిటీల సభ్యులు,ముస్లిం సోదరులు పాల్గొన్నారు.