మన్యంన్యూస్,ఇల్లందు:ఇల్లందు నియోజకవర్గ బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశం ఆదివారం పట్టణంలోని స్థానిక అయితా ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మాజీ రాజ్యసభసభ్యులు గరికపాటి మోహనరావు, మాజీ ఎంపీలు చాడ సుదర్శన్ రెడ్డి, రవీంద్రనాయక్లు హాజరయ్యారు. తొలుత స్థానిక బీఎంఎస్ ఆఫీస్ నుండి పాతబస్టాండ్ వరకు భారీర్యాలీ తీశారు. అనంతరం బీఎంఎస్ ఇల్లందు బ్రాంచి ఉపాధ్యక్షులు నాయని సైదులు ఆధ్వర్యంలో ఐత ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ..కార్యకర్తలు భేషజాలు మరచి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని, రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపుకు సిద్దమవ్వాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ ఇల్లందు ఏరియా సెక్రటరీ లీలాకృష్ణ, ఆర్గనైజషన్ సెక్రటరీ శశికుమార్, పిట్ సెక్రటరీ ప్రదీప్, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల అధ్యక్షులు రాము, సెక్రటరీ వెంకటేష్, కొయ్యగూడెం పిట్ సెక్రటరీ గోపాలకృష్ణ, సింగరేణి ఓబీ కాంట్రాక్టు కార్మికుల అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఆర్గనైజషన్ సభ్యులు శ్రీను, గణేష్ సైదులు, సురేష్, తరుణ్, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
