UPDATES  

 ఏజెన్సీ డీఎస్సీ పకడ్బందీగా అమలు చేయాలి.. హేమ సుందర్

 

మన్యం న్యూస్ దుమ్మగూడెం సెప్టెంబర్ 10::
ఏజెన్సీ ప్రాంతంలో డీఎస్సీ నోటిఫికేషన్ జీవో నెంబర్ 3 ప్రకారం పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పాండు హేమ సుందర్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని నడికుడి గ్రామపంచాయతీ పరిధిలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులకు జీవో నెంబర్ 3 అమలు చేసి ఆదివాసి నిరుద్యోగులతో 100% భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసి చట్టాలు రిజర్వేషన్లు కనుమరుగయ్యే అవకాశం ఉందని దీనికి ప్రతి ఒక్కరు పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సోందే మల్లుదొర, నాయకులు వినోద్, సతీష్, మురళి, నాగేశ్వరరావు, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !