సంక్షేమంలో సీఎం కేసీఆర్ గిన్నిస్ రికార్డ్
* 215 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పాల్వంచ పట్టణాలకు మహర్దశ
* అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలన్నదే బిఆర్ఎస్ లక్ష్యం
* కొత్తగూడెంకు మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల మంజూరు చేయించా
* శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సంక్షేమ పధకాల అమలులో తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గిన్నిస్ రికార్డు సృష్టించారని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలన్నదే బిఆర్ఎస్ లక్ష్యమని తెలిపారు.
215 కోట్ల రూపాయల మంజూరుతో కొత్తగూడెం పాల్వంచ పట్టణాలకు మహర్దశ పట్టనున్నదని చెప్పారు. ఆదివారం కొత్తగూడెం మున్సిపాలిటీలోని రామటాకీస్, మథురబస్తి, సన్యాసి బస్తి, ఏ పవర్ హౌస్ బస్తి ప్రాంతాల్లో ఎమ్మెల్యే వనమా సుడిగాలి పర్యటన చేసి సుమారు 17 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా కొత్తగూడెంను అభివృద్దిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు. గతంలో తన హాయంలో రైల్వే అండర్ బ్రిడ్జి, మొర్రేడు బ్రిడ్జి, గోధుమ వాగు బ్రిడ్జి కట్టించడం జరిగిందని గుర్తు చేశారు. అంతేకాకుండా10 వేల మందికి ఎంతో చారిత్రాకమైన క్రమబద్దీకరణ పట్టాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఎంతో కష్టపడి కొత్తగూడెంకు మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల మంజూరు చేయించారని తెలిపారు.
తెలంగాణ పధకాలు దేశానికే ఆదర్శమని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారిగా తీర్చడమే కాకుండా ఇవ్వని వాగ్దానాలను సైతం అమలు పరుస్తున్నట్లు చెప్పారు. ఓడినా గెలిచినా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకుంటానని తెలిపారు.
వనమాకు ఘనంగా స్వాగతం బ్రహ్మరధం..
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వార్డుల్లో పర్యటించిన స్థానిక శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావుకు ఆయా వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికి బ్రహ్మ రథం పట్టారు. డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేసారు. వనమా పలుచోట్ల మహిళలతో డ్యాన్సు చేసి ఉత్సాహాన్ని నింపారు.
ఈ కార్యక్రమంలో వనమా రాఘవేందర్, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య రాంబాబు, కౌన్సిలర్లు వేముల ప్రసాద్, కోలాపూరి ధర్మరాజు, అంబుల వేణు, తంగెళ్ల లక్ష్మణ్, ఆమనీ, నేరెళ్ళ సమాక్య, కో ఆప్షన్ సభ్యులు కనుకుంట్ల పార్వతి, దుంపల అనురాధ, దూడల బుచ్చయ్య, బిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, మున్సిపల్ అధికారులు, స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు.