UPDATES  

 ఘనంగా చైతన్య రెడ్డి జన్మదిన వేడుకలు.

ఘనంగా చైతన్య రెడ్డి జన్మదిన వేడుకలు.

బిఆర్ఎస్ పట్టణ యూత్ ప్రెసిడెంట్ జన్మదిన వేడుకలు

మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు సారపాక టౌన్ బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోము చైతన్య రెడ్డి జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కేక్ కటింగ్ చేయించి శుభాకాంక్షల వెల్లువ తెలిపారు.ఈ సందర్భంగా జన్మదిన వేడుకలు జరుపుకున్న లక్ష్మీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ పినపాక గడ్డపై రేగా కాంతారావు గెలుపు కోసం యువత అందరిని ఒక్కటిగా చేసి,రేగా కాంతారావు గెలుపు కోసం పోరాడుతామని యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదని బూర్గంపహాడ్ మండలంలో ఉన్న యువత అంతా ఒకటిగా కలిసికట్టుగా పనిచేస్తూ పినపాక నియోజకవర్గ గడ్డపై రేగాకు తిరుగులేని విజయాన్ని చేకూర్చేందుకు యువత ముందడుగులో ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను,సారపాక టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలి శ్రీహరి,పినపాక నియోజకవర్గ యూత్ అధ్యక్షులు చల్లకోటి పూర్ణచంద్రరావు,మండల యూత్ నాయకులు జై,బెజ్జంకి కనకాచారి,ఏసుబు,చిరంజీవితో పాటు పలువురు ముఖ్య నాయకులు,ముఖ్య కార్యకర్తలు యూత్ పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !