1992 -93 పూర్వ విద్యార్థుల స్నేహితుల పిల్లలకు ఆర్థిక సహాయం
ఇద్దరు స్నేహితులకు రూ35 వేల అందజేసిన పూర్వ విద్యార్థులు
మన్యం న్యూస్, అశ్వాపురం: మండల కేంద్రంలో జిల్లా ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1992-93, లో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఇటీవలే పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.ఈ నేపథ్యంలో తమతో పాటు చదువుకున్న పేద పూర్వవిద్యార్థులకు ఎలాంటి కష్టాలు వచ్చినా వెన్నంటే మేమున్నాం అని భరోసా కల్పించి స్నేహితుల కష్ట సుఖాలలో మేమున్నామని సాయం చేయుటకు ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థులు.
మండలంలోని జగ్గారం గ్రామనికి చెందిన వంకాయల రాములు కుమారుడు ఆదిత్య కి యర్కోస్ వ్యాధి బాధపడుతున్న అతనికి ఖమ్మం ఆర్కే హాస్పిటల్ నందు వైద్య ఖర్చుల నిమిత్తం రూ25వేలు కుటుంబ సభ్యులకు సోమవారం ఆర్థిక సహాయం అందించారు. సిలివేరు వెంకటేశ్వర్లు కుమార్తెకి ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆమెకు చదువులు ఖర్చు నిమిత్తం రూ.10వేలు కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేసి ఔదార్యమును చాటుకున్నా రు.ఈ కార్యక్రమంలో గరికపాటి అంజన్ రావు, కొర్లకుంట శ్రీనివాసరావు కల్వ చర్ల రవి సండ్ర సతీష్, కడారి రాంబాబు, తాడుబోయిన వెంకటేశ్వర్లు, జగన్ మోహన్ రెడ్డి , పళ్ళ మట్టారెడ్డి, చిలక రాంబాబు,నల్లపాటి నాగేశ్వరరావు కైలాసం రాము,రామడుగు రామాచారి, యార్లగడ్డ చందు, దొండేటి బోస్ , రామలింగం,పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.