మన్యం న్యూస్,చండ్రుగొండ, సెప్టెంబర్ 11 : మండల పరిధిలోగల మద్దుకూరు గ్రామపంచాయతీ శివారు మంగళబోడు గ్రామాన్ని సోమవారం ఎస్సై మాచినేని రవి సందర్శించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ… మంగళబోడు గ్రామాన్ని సందర్శించడం జరిగిందని, గోత్తికోయల కుటుంబాలకు వ్యక్తిగత శుభ్రత,పరిసరాల పరిశుభ్రత,గోత్తికోయల పిల్లలకు విద్యపై మక్కువ చూపాలని, ముఖ్యంగా కుటుంబ నియంత్రణపై ఇద్దరు వద్దు – ఒకరు ముద్దు అని కుటుంబ నియంత్రణ గురించి గోత్తికోయల కుటుంబాలకు అవగాహన కల్పించడం జరిగిందని, పక్కనే ఉన్న సీతారామ కెనాల్ దగ్గరకు పిల్లలని పంపించవద్దని, పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు . ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ కోటి, హోంగార్డు సురేష్, పక్క గ్రామస్తుడు బొర్రా సురేష్,గోత్తి కోయల కుటుంబాలు, తదితరులు పాల్గొన్నారు.