వినాయక మండపాలకు ఉచితంగా హోమ ద్రవ్యాలు పంపిణీ
* గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కె.వి.రంగా కిరణ్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం టౌన్:
వినాయక చవితి పండుగ సందర్భంగా ఈనెల 18 నుండి జరిగే నవరాత్రి ఉత్సవాలు ప్రజలంతా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కొత్తగూడెం గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కె.వి.రంగా కిరణ్ అన్నారు. సోమవారం
కొత్తగూడెం వివేకానంద విద్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే నిర్వాహకులు పోలీసు వారి సూచనలు పాటిస్తూ పోలీసు విద్యుత్ పర్మిషన్లను తీసుకొని మండపాలను ఏర్పాటు చేసుకోవాలని అదేవిధంగా వారికి ఏ విధమైన ఇబ్బందులు ఉన్న కమిటీ దృష్టికి తీసుకురావాలని కమిటీ వారు మండపాల వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఈనెల 20 నుండి వివేకానంద విద్యాలయంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉచితంగా హోమ ద్రవ్యాలను కమిటీ ఆధ్వర్యంలో అందచేస్తామని తెలిపారు. వారి మండపం వివరాలను తెలియచేసి హోమ ద్రవ్యాలను తీసుకెళ్లవచ్చునని ఈ అవకాశాన్ని కొత్తగూడెం చుంచుపల్లి లక్మి దేవిపల్లి సుజాత నగర్ మండలంలోని మండపాల నిర్వాహకులు ఉపయోగించుకోవాలని కోరారు. మండపాల నిర్వాహలకు ఇబ్బందులు తలెత్తితే 9866236937 నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు.
ఈకార్యక్రమంలో కమిటీ కార్యదర్శి ధారా రమేష్ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.