మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, అగ్నిమాపక, విద్యుత్, మున్సిపల్ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకావాలని అన్నారు. అన్ని గణేష్
మండపాలను తప్పని సరిగా రిజిస్ట్రేషన్
చేసుకోవాలని చెప్పారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ముందస్తుగా గణేష్ మండలి నిర్వాహకులు పూర్తి వివరాలు అందించాలని, ఇది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో
ఉచిత మట్టిగణపతులు పంపిణీ చేయనున్నామని, ప్రజలు మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ రవీందర్, ఏఎస్పీ పరితోష్ పంకజ్, డిపిఓ రమాకాంత్, మిషన్ భగీరథ ఈ ఈ తిరుమలేష్, మున్సిపల్ కమిషనర్లు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కె.రంగాకిరణ్, దారా రమేష్, వందనపు శ్రీధర్, జి.వెంకటేశ్వరరావు, చింతల చెరువు శ్రీనివాస్ రావు, జల్లారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.