మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 12::
నిరవేదిక సమ్మెలో పాల్గంటున్న అంగన్వాడి ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వ వేధింపులు ఆపాలి అని సంఘ నాయకులు కారం పుల్లయ్య, నరాటి ప్రసాద్ హెచ్చరించారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్త సమ్మె రెండో రోజులో భాగంగా దుమ్ముగూడెం ప్రధాన రహదారిపై అంగన్వాడి టీచర్లు భారీ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగస్తులు సమ్మెలో వెళ్లకుండా మంత్రి సత్యవతి రాథోడ్, కమిషనర్ వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వేధింపులు కాకుండా సమస్యలు పరిష్కారం దిశగా ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మల్లికార్జున్, రామిరెడ్డి, చిన్నారి, రత్నకుమారి, నరసమ్మ, కృష్ణవేణి, కమలాదేవి, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.