రోబోటిక్ సర్జరీతో మోకాళ్ళ నొప్పులకు చెక్
* యశోద హాస్పిటల్ వైద్యులు దాచేపల్లి సునీల్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఇటీవల కాలంలో అనేకమంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారని వాళ్లంతా ఉపసమనం కోసం పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుందని హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ దాచేపల్లి సునీల్ తెలిపారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని హోటల్ లేపాక్షిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కీళ్ల నొప్పులు బాగా ఉన్నవారు డాక్టర్లను సంప్రదించి సలహాలు తీసుకొని సరైన వైద్యం తీసుకోవాలన్నారు. బాగా మోకాళ్ళ నొప్పులు ఉండి లోపల గుజ్జు తరిగిపోయి ఎముకలు అరిగిపోయి ఉన్నట్లయితే వారు కొత్తగా వచ్చిన రోబోటిక్ సర్జరీ చేయించుకుంటే నొప్పులు పూర్తిగా తగ్గడంతో పాటుగా హాయిగా నడక సాగించవచ్చని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో మోకాళ్ళకు ఆపరేషన్ చేయించుకోవచ్చని వివరించారు. మోకాలు నొప్పులు ఉన్న సరే ప్రతిరోజు నడక సాగిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. తాను కొత్తగూడెంకు చెందిన వాడిని ఈ ప్రాంత వారికి ఎంతోకొంత వైద్య సహాయం అందించాలని లక్ష్యంతో ప్రతి నెల 2వ మంగళవారం కొత్తగూడెం కొచ్చి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్లకు వైద్య సేవలు అందిస్తున్నానని తెలిపారు. మోకాళ్ళ నొప్పుల ఆపరేషన్ చేసుకుంటే ఇక నడవలేమని మంచానికి పూర్తిగా పరిమితమైతామని భయాందోళనలో ఉన్నారని వారు ఎలాంటి ఆందోళన చెందకుండా రోబోటిక్ సర్జరీతో చక్కగా జనంలో నడవవచ్చని తెలిపారు. మోకాళ్ల నొప్పులపై అనేకమందికి అవగాహన కల్పించడం జరుగుతుందని డాక్టర్ దాచేపల్లి సునీల్ తెలిపారు.œ