మన్యం న్యూస్ ,బూర్గంపహడ్: మండల కేంద్రంలోని శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా హనుమంతుడికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ ఆలయం ప్రత్యేకత. హనుమంతుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని కొలుస్తూ జై శ్రీరామ్, జై హనుమ అంటూ జపిస్తూ రామభజన చేశారు.