:మన్యం న్యూస్, గుండాల: ప్రజాపంథా అనుబంధ సంఘమైన పి వై ఎల్ నూతన గ్రామ కమిటీనిమంగళవారం ఎన్నుకున్నారు. మండలం పరిధిలోని మఠంలంక గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ గ్రామ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా కార్యదర్శి వాంకుడోత్ అజయ్, జిల్లా నాయకులు శంకరన్న పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఉద్యోగ అవకాశాలు లేక యువత నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మంగయ్య, నాయకులు కోడూరి జగన్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
