ప్రతి మహిళ ఆరోగ్యం తో ఉండాలి అనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
*మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8రకాల ఆరోగ్య సమస్యల కు వైద్యం
*ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక ఓపి
*మహిళ మెరుగైన వైద్యం కొరకు ప్రత్యేక హెల్ప్ డెస్క్
* పినపాక ప్రాథమిక కేంద్రంలో ఆరోగ్య మహిళ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేగా
మన్యం న్యూస్,పినపాక:ప్రతి మహిళ ఆరోగ్యం తో ఉండాలి అనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు అన్నారు. మంగళవారం పినపాక మండల కేంద్రంలో ని పినపాక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రతి బిడ్డకు ప్రభుత్వం సంక్షేమం అందాలనే దృఢ సంకల్పంతో అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కోవాలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల ఆరోగ్య రక్షణ కొరకు ఆరోగ్య మహిళా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకంతో పిహెచ్సి లలో వైద్యులు మహిళలకు సంబంధించిన 8 రకాల రోగాలకు సంబంధించి వైద్య సేవలు అందించబడతాయని అన్నారు. మెరుగైన వైద్యం అవసరం అయిన ఎడల ప్రధాన ఆసుపత్రికి రిఫర్ చేస్తారని, ఆయా ఆసుపత్రుల్లో వెళ్లిన మహిళ రోగులకు సహాయ సహకారాలు అందించడానికి ప్రత్యేక హెల్ప్ డెస్క్ లు సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళలు ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ కమిటీ చైర్మన్ పోనుగోటి భద్రయ్య,ప్యాక్స్ చైర్మన్ డా. రవి శేఖర్ వర్మ, పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మధు,బీ. ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి,ఉప సర్పంచ్ బుస్సి శ్రీనివాసరావు ,సొసైటీ డైరెక్టర్లు కొండేరు రాము,పోనుగోటి కామేశ్వరరావు,సీనియర్ నాయకులు బోలిశెట్టి నర్సింహారావు,జలగం రాములు గౌడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
