జర్నలిస్టు సదానందానికి ఆర్థిక సాయం
* బిజెపి నేత కె.వి రంగా కిరణ్ కు కృతజ్ఞతలు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం టౌన్:
పత్రిక రంగంలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్, కరాటే మాస్టర్ పెనుగొండ సదానందం గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని చుంచుపల్లి మండల విలేకరులు బిజెపి రాష్ట్ర నాయకులు సంఘ సేవకుడు, ఆర్కే ట్రస్ట్ అధినేత కె.వి రంగా కిరణ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి మంగళవారం సదానందం ఇంటికి వెళ్లి నిత్యవసర సరుకులతో పాటు కొంత నగదును అందజేశారు. దీంతో సదానందం కుటుంబ సభ్యులతో పాటుగా పలువురు జర్నలిస్టులు కెవి రంగా కిరణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు వార్తా రిపోర్టర్ బాబు, సూర్య స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ షఫీ, సీనియర్ పాత్రికేయులు సీమకుర్తి రామకృష్ణ, కరాటే మాస్టర్ మొగిలి, తోటి పాత్రికేయులు అఫ్జల్ పటాన్, తెలంగాణ సురేష్, నక్క శాంసన్ రాజు, కిరణ్, సురేష్, రాందాస్, కొట్టి నవీన్, రాజ్ కుమార్, ప్రజా జ్యోతి నరేష్, బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన ప్రతినిధి చింతల చెరువు శ్రీనివాస్, జిల్లా ఓబిసి మోర్చా కోశాధికారి జల్లారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.