మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబరు 13::
అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని దుమ్ముగూడెం ఐసిడిఎస్ కార్యాలయం ముందు అంగన్వాడి టీచర్లు 3 రోజు సమ్మె బాట చేపట్టారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడి యూనియన్ సిఐటియు, ఏఐటియుసి నాయకులు కే బ్రహ్మచారి, రామిరేడ్డి పాల్గొని మాట్లాడుతూ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగులను తక్షణమే పర్మినెంట్ చేయాలని కనీస వేతనం రూ. 26, వేలను ఇవ్వాలని పెన్షన్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ.10 లక్షలు హెల్పర్స్ కు రూ.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు మర్లపాటి రేణుక, నరేష్, అంగన్వాడి నాయకులు కమలాదేవి, కృష్ణవేణి, బుచమ్మ, లలిత, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.