మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 13::
రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వ్యవసాయ కూలీలకు రేట్లు పెంచాలని కోరుతూ బుధవారం మండల పరిధిలోని నరసాపురం రేగుబల్లి దంతనం గ్రామాలలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి కూలీలు సమావేశం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులతో చర్చించిన రైతులు సానుకూలంగా స్పందించి రోజువారి కూలి రేట్లు పెంచుటకు ఒప్పుకున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు లు మచ్చ వెంకటేశ్వర్లు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు రవికుమార్, కారం పుల్లయ్య, రైతు జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ, భక్తుల వెంకటేశ్వర్లు, చంద్రయ్య, సత్యనారాయణ,, రైతులు లోకేష్ రావు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.