మన్యం న్యూస్ కరకగూడెం:మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల. సోమయ్య ఆద్వర్యంలో ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా.కాంతారావు ఆదేశాలతో ముమ్మరంగా బిఅర్ఎస్ పార్టీ ప్రభుత్వ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నియోజకవర్గం వ్యాప్తంగా చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూ గడప గడపకు,ఇంటింటికి కరపత్రాల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టుతున్న సంక్షేమ పథకాలు ఆసరా పింఛను, రైతుబందు,రైతు భీమా, బిసి బందు,కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ గర్భిణీ మహిళలకు నూట్రిషన్ కిట్స్,కేసిఅర్ కీట్స్ వంటి మొదలైన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడం జరిగిందని అన్నారు.అలాగె రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పినపాక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ని కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు తెలుపుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బత్తిని.నరసింహరావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు పాయం. రాజబాబు,నాయకులు బత్తిని. సీతయ్య,బోడా.లక్ష్మణ్,సలుగు.బిక్షపతి,ఎట్టి.ప్రసాద్,నిట్ట.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
