మన్యం న్యూస్ గుండాల: ఉత్తమ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు మండల కేంద్రం,గుండాల పంచాయతీని వరించింది. ఈ అవార్డునుజిల్లా కలెక్టర్ ప్రియాంక అలా చేతుల మీదుగాబుధవారం గుండాల పంచాయతీ సర్పంచ్ కోరం సీతారాములు, కార్యదర్శి శ్రీనివాస్ కొత్తగూడెంలో కలెక్టరేట్ లో అందుకున్నారు. పంచాయతీలలో శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాల్లో గుండాల పంచాయతీ మెరుగైన ఫలితాలను సాధించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, ఎంపీడీవో సత్యనారాయణ,ఎంపీఓ హాజరత్ వలి, ఉపాధి హామీ ఎపిఓ రవితేజ తదితరులు పాల్గొన్నారు.
