UPDATES  

 అంగన్వాడీలకు అఖిలపక్షాల మద్దతు ఏఐటీయూసీ,సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా

 

మన్యం న్యూస్ మణుగూరు:

అంగన్వాడీ టీచర్లు,మినీ అంగన్వాడి,ఆయాల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు అక్కి.నరసింహారావు,సిఐటియు జిల్లా నాయకులు గద్దల శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు. బుధవారం నాడు ఐసిడిఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలో వారు పాల్గొని మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.మినీ అంగన్వాడి టీచర్లను అంగన్వాడీ టీచర్లుగా గుర్తించాలని,ప్రభుత్వం పిఎఫ్, ఈఎస్ఐ కల్పించాలని అని డిమాండ్ చేశారు.ఉద్యోగంలో ఏమైనా జరిగితే ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు 10 లక్షలు, ఆయాలకు 5 లక్షల రూపాయలు చెల్లించాలని, ఉద్యోగ విరమణ పొందితే టీచర్లకు 10 లక్షలు,ఆయాలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని,వీరు రిటైర్ అయితే ఉద్యోగంలో సగం పెన్షన్ రూపంలో చెల్లించాలని కోరుతూ గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలో భాగంగా మూడవ రోజు మణుగూరు లో ఏఐటీయూసీ,సిఐటియు ఆధ్వర్యంలో ఐసిడిఎస్ కార్యాలయం ముందు సుమారు మూడు గంటలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వీరి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.అంగన్వాడి టీచర్లకు సిపిఐ,సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు ఐసిడిఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నటువంటి ఆందోళనకు సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మున్నా లక్ష్మీకుమారి,సిపిఐ పట్టణ కార్యదర్శి దుర్గలసుధాకర్, సిపిఎం మండల కార్యదర్శి గోడి షాల రాములు,సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎస్కే సర్వర్, పాల్గొని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !