4వ రోజుకు చేరిన అంగన్వాడీ ల సమ్మె.
సమ్మెను సందర్శించిన సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి
మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
వెంకటాపురం మండల కేంద్రంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీలు అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కృషి చేశారని, చిన్నపిల్లలకు విద్యా గర్భిణీ స్త్రీలకు పౌష్టి ఆహారం, అందించడంలో వారి పాత్ర అమోఘమని అన్నారు. అంగన్వాడి కార్యకర్తలకు కనీస వేతనం 26 వేల రూపాయలు నెలకు ఇవ్వాలని అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలనిడిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు దావత్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వాసు, రఘుపతి, సిఐటియు మండల కార్యదర్శి కట్ల నరసింహ చారి, అంగన్వాడి నాయకులు మీనా కుమారి,ప్రేమ కుమారి, అరుణకుమారి, సడలమ్మ,ఎస్ ఎన్ కుమారి, వెంకటరమణ సమ్మక్క బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
