మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి మరువలేనిది
* జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి షేక్ అన్వర్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సీఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి చేస్తున్న కృషి మరువలేనిదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి షేక్ అన్వర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఉన్న తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద మైనార్టీలకు లక్ష ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించడం హర్షనీయమన్నారు. 100 శాతం సబ్సిడీతో
ఆర్థిక సహాయాన్ని అందించడం గొప్ప విషయం అన్నారు. మొదటి దశలో భాగంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పదివేల మంది రుణం అందించిందన్నారు. రెండో దశ ప్రారంభానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. రెండో దశకు ప్రభుత్వం ఇప్పటికి 150 కోట్లు కేటాయించిందన్నారు. ఈ సహాయం పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఇప్పటికీ అధికార యంత్రంగానికి ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. తొలి దశలో పదివేల మందికి లక్ష చొప్పున 100 కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మైనార్టీల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాలు పాలకులు మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ ముస్లిం మైనారిటీ పినపాక నియోజకవర్గం నాయకులు గుల్ మొహమ్మద్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.